ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉందని చెప్పారు. పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా పాలనా వికేంద్రీకరణను ప్రస్తావించిందని మంత్రి చెప్పారు. నాడు అధికారంలో ఉన్న టీడీపీ శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు చెప్పిన మాటలను తాము పెద్దగా పట్టించుకోబోమన్నారు.
మరిన్ని వార్తల కోసం