క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం : మంత్రి డి.శ్రీధర్​బాబు

క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం : మంత్రి డి.శ్రీధర్​బాబు
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్​బాబు

గోదావరిఖని, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్​బాబు తెలిపారు. స్కూల్​ గేమ్స్​ ఫెడరేషన్​ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి (అండర్‌‌‌‌‌‌‌‌–17) వాలీబాల్​ పోటీలను ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​తో కలిసి సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్​ పాలనలో క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు. పీఈటీలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించి, ప్రమోషన్లు కూడా ఇచ్చామన్నారు.

రామగుండం ప్రాంతంలో సింగరేణి సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో స్టేడియాన్ని నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో మినిమమ్​ వేజ్​ అడ్వైజరీ బోర్డు చైర్మన్​ బి.జనక్​ ప్రసాద్​, రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్​, సింగరేణి జీఎం డి.లలిత్​ కుమార్, లీడర్లు కిరణ్​బాబు, పెద్దెల్లి తేజస్విని, వాసు, రాజేశ్​, స్వామి, పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన 240 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.

కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌ను మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు సోమవారం పరామర్శించారు. ఇటీవల గంగుల మాతృమూర్తి చనిపోయిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, విప్ అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్​ ఉన్నారు.