ప్రభుత్వ ఆఫీసులకు స్థల సేకరణ చేయాలి : దామోదర రాజనర్సింహ

ప్రభుత్వ ఆఫీసులకు స్థల సేకరణ చేయాలి : దామోదర రాజనర్సింహ

జోగిపేట, పుల్కల్, వెలుగు: ప్రభుత్వ ఆఫీసులకు స్థల సేకరణ చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఆందోల్, పుల్కల్​మండలాల్లో పర్యటించారు. ఆందోల్​లో నర్సింగ్​ కాలేజీ భూమి పూజ ఏర్పాట్లను పరిశీలించారు. చౌటకూర్​లో ప్రభుత్వ ఆఫీసుల కోసం స్థలాన్ని 15 రోజుల్లోగా సేకరించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, ఎంపీడీవో ఆఫీసులకు స్థల పరిశీలన చేశారు. చౌటకూర్ మండల కేంద్రంలో అన్ని ఆఫీసులకు సరిపోయే స్థలం లేకపోతే సుల్తాన్ పూర్ గ్రామ శివారులో నేషనల్ హైవే పక్కన మిగిలిన ఆఫీసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

అక్కడ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో పాండు, మున్సిపల్​చైర్మన్​మల్లయ్య, కౌన్సిలర్లు నాగరాజు, సురేందర్​గౌడ్​, సురేశ్, తహసీల్దార్ కిరణ్ కుమార్, పార్టీ అధ్యక్షుడు దశరథ్, ఉపాధ్యక్షుడు రామగౌడ్, నాయకులు సార గోవర్ధన్, ఈశ్వర్ గౌడ్ ఉన్నారు.