పథకాల అమలులో అపోహలు పెట్టుకోవద్దు : మంత్రి దామోదర రాజనర్సింహ

పథకాల అమలులో అపోహలు పెట్టుకోవద్దు : మంత్రి దామోదర రాజనర్సింహ
  • గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక
  • మంత్రి దామోదర రాజనర్సింహ

రాయికోడ్, వెలుగు : సంక్షేమ పథకాల అమలుపై అపోహలు పెట్టుకోవద్దని, గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక జరుగుతుందని  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌‌‌‌ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని మార్కెట్‌‌‌‌ నుంచి వాల్మికీ చౌరస్తా వరకు సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌ నుంచి మార్కెట్‌‌‌‌ యార్డు వరకు మెయిన్‌‌‌‌ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. 

యువతలో నైపుణ్యం పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఐటీఐ మంజూరు చేసినట్లు తెలిపారు. అంతకుముందు వీరభద్రేశ్వరుడి దర్శనానికి వచ్చిన మంత్రికి దేవాదాయ శాఖ అసిస్టెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌, ఈవో శివరుద్రప్ప, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ అంజయ్య, మార్కెట్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ సుధాకర్‌‌‌‌రెడ్డి, వినయ్, కాంగ్రెస్‌‌‌‌ మండల అధ్యక్షుడు బాలాజీ, నర్సింలు

కాంగ్రెస్‌‌‌‌ నాయకులు సిద్దన్న పాటిల్, మల్లికార్జున్‌‌‌‌ పాటిల్‌‌‌‌, జగన్‌‌‌‌మోహన్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మునిపల్లి మండలంలోని బుధేర సోషల్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ రెసిడెన్షియల్‌‌‌‌ డిగ్రీ, పీజీ కాలేజీతో పాటు తాటిపల్లి కస్తూరిబా స్కూల్‌‌‌‌ను సందర్శించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.