రైతును రాజు చేసి తీరుతాం : మంత్రి  దామోదర్ రాజనర్సింహ

రైతును రాజు చేసి తీరుతాం : మంత్రి  దామోదర్ రాజనర్సింహ
  • రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ
     
  • శివ్వంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

సంగారెడ్డి, వెలుగు: రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.  బుధవారం సంగారెడ్డి జిల్లా శివ్వంపేటలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ..  జిల్లాలో మొత్తం 211 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కామన్ వెరైటీ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,300 సూపర్ ఫైన్ వెరైటీకి క్వింటాలుకు రూ. 2,320 చెల్లించనున్నట్లు తెలిపారు.  సన్న ధాన్యానికి క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ ను ప్రభుత్వం చెల్లించనున్నట్లు చెప్పారు.  కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి, డీసీఎంఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ శివకుమార్, జిల్లా సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

 ట్రాఫిక్ నియంత్రణకు టాస్క్ ఫోర్స్

.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైకులను మంత్రి ప్రారంభించారు.  సంగారెడ్డిలోని సీఎస్ఐ చర్చి వద్ద ట్రిపుల్ ఎస్ ఆధ్వర్యంలో గ్లాన్ ఫార్మా కంపెనీ సహకారంతో మొత్తం 10  బైకులు కొనుగోలు చేశారు. ఆయా బైకులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.  మంత్రి దామోదర ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో నూతన కలెక్టర్ క్యాంపు ఆఫీసు భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.