తనిఖీల వివరాలు ప్రతి నెల నాకు రిపోర్ట్ చేయాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

తనిఖీల వివరాలు ప్రతి నెల నాకు రిపోర్ట్ చేయాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

ప్రైవేటు, కార్పోరేట్ హాస్పిటళ్లలో టాస్క్ ఫోర్స్ కమిటీలు నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు మంత్రి దామోదర రాజనర్సింహ. తనిఖీల వివరాలను ప్రతి నెల తనకు రిపోర్ట్ చేయాలని సూచించారు. సెక్రటేరియెట్ లో వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు మంత్రి. ఫుడ్ సెక్యూరిటీ అధికారులు హాస్పిటళ్లలో డైట్ క్యాంటీన్లను తనిఖీలు చేయాలని చెప్పారు. ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల HODలు జిల్లాల్లోని హాస్పిటల్స్ ను విజిట్ చేయాలని సూచించారు. హాస్పిటల్ హెచ్ఆర్, అటెండెన్స్ , ఎక్విప్ మెంట్, మెడిసిన్, సానిటేషన్, డైట్ సహా ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. 

ప్రభుత్వ దవాఖాన్లలో పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు హెల్త్ మినిస్టర్.అన్ని హాస్పిటళ్లలో అవసరమైన మెడిసిన్  అందుబాటులో ఉంచాలన్నారు. ఏజెన్సీల్లో గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈడీడీ కంటే వారం రోజుల ముందే సమీపంలోని హాస్పిటల్ కు తరలించి, బర్త్ వెయిటింగ్ రూమ్స్ ను కేటాయించాలన్నారు. ఐటీడీఏల పరిధిలో హాస్పిటళ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు మంత్రి. 

ALSO READ | కేటీఆర్కు పొంగులేటి సవాల్..ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా?

డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, టాస్క్ ఫోర్స్ కమిటీలపై ప్రతి నెలా రివ్యూ చేస్తానన్నారు మంత్రి దామోదర. అన్ని వివరాలతో రివ్యూకు అటెండ్ కావాలని అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో బయోమెట్రిక్ అటెండెన్స్  సిస్టమ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి.