కార్బైడ్ వాడినట్లు తెలిస్తే టోల్​ ఫ్రీ కి కాల్​ చేయండి : మంత్రి దామోదర రాజనర్సింహ 

కార్బైడ్ వాడినట్లు తెలిస్తే టోల్​ ఫ్రీ కి కాల్​ చేయండి : మంత్రి దామోదర రాజనర్సింహ 
  • టోల్​ ఫ్రీ  91001 05795 ను ప్రకటించిన మంత్రి దామోదర రాజనర్సింహ 

హైదరాబాద్, వెలుగు: పండ్లను సహజంగానే మాగబెట్టాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. పక్వానికి వచ్చేందుకు కార్బైడ్ వంటి రసాయనాలు వాడితే కఠిన చర్యలు ఉంటాయని  హెచ్చరించారు. ఫుడ్​సేఫ్టీ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో ‘మామిడి కాయలను ఎలా మాగబెట్టాలో’ తెలిపేలా రూపొందించిన అవేర్నెస్​పోస్టర్​ను సోమవారం మెడికల్ కార్పొరేషన్(టీజీఎంఎస్‌ఐడీసీ) ఆఫీసులో మంత్రి ఆవిష్కరించారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు సహజ పద్ధతుల్లో మామిడి కాయలను మాగబెట్టాలని సూచించారు. కార్బైడ్ వంటి రసాయనాలు వాడినట్లు తెలిస్తే.. 91001 05795 నంబర్ కు కాల్ చేయాలని,  నిషేధిత పదార్థాలను ఉపయోగించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలని ఆదేశించారు.