అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తాం : దామోదర రాజనర్సింహ

అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తాం : దామోదర రాజనర్సింహ
  • మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట, వెలుగు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం ఆందోల్​మండలంలోని నేరెడిగుంటలో జరిగిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల కాలనీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తానన్నారు.  ఆ భూమిలో సర్వే చేసి కాలనీ ఏర్పాటు పనులు మొదలుపెట్టాలని ఆర్డీవో పాండును  ఆదేశించారు.  అక్కడే ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

అదే రోజు ప్రైమరీ హెల్త్​ సెంటర్​కు భూమిపూజ చేస్తానన్నారు. నేరేడు గుంట నుంచి బ్రాహ్మణ పల్లికి కొత్త రోడ్డు వేయిస్తానన్నారు. రేషన్ కార్డు లేని వారికి కొత్త కార్డుల మంజూరుతో పాటు పాత రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతరం కొనసాగుతుందన్నారు. 

కలెక్టర్ క్రాంతి  మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామసభలలో దరఖాస్తు చేసుకోని లబ్ధిదారులు ఎంపీడీవో ఆఫీసులోని ప్రజా పాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఏవో శివప్రసాద్, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి , హౌసింగ్ పీడీ చలపతిరావు, ఆర్డీవో పాండు, తహసీల్దార్​విష్ణు సాగర్, అధికారులు,  ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.