ఆటలతోనే గెలుపోటములనుతట్టుకునే శక్తి : మంత్రి దామోదర రాజనర్సింహ 

ఆటలతోనే గెలుపోటములనుతట్టుకునే శక్తి : మంత్రి దామోదర రాజనర్సింహ 

హైదరాబాద్, వెలుగు : ఆటలతోనే జీవితంలో గెలుపోటములను తట్టుకునే శక్తి వస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఆటలతో పిల్లల్లో పోటీతత్వం పెరగుతుందన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన 11వ తెలంగాణ స్టేట్ మాస్టర్స్‌‌ అథ్లెటిక్ చాంపియన్‌‌ షిప్‌‌ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయి, జనాలు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు(లైఫ్ స్టైల్‌‌ డిసీజెస్‌‌) బారిన పడుతున్నారు.  ఇంతకు ముందు కంటే ఎక్కువగా క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’’ అని మంత్రి చెప్పారు.