- మంత్రి దామోదర రాజనర్సింహ
- ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ
వెలుగు, న్యూస్‌నెట్‌వర్క్: ఉమ్మడి మెదక్జిల్లాలో ఆదివారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా పథకాలను ప్రజాప్రతినిధులు, అధికారులు పలుచోట్ల ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్మండలంలోని ఈసోజిపేట, ఆందోల్మండలంలోని నేరడిగుంటలో మంత్రి దామోదర రాజనర్సింహ, కలెక్టర్క్రాంతితో కలిసి పాల్గొని లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అన్నారు.
ఇసోజుపేటలో 123 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సంక్షేమ పథకాల ఫలాలు చిట్టచివరి వ్యక్తికి చేరేవరకు కొనసాగుతాయని తెలిపారు. కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విడతలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని చెప్పారు. కొండాపూర్ లో టీజీ ఐఐసీ చైర్పర్సన్నిర్మలా రెడ్డి 138 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేశారు.
నారాయణఖేడ్ మండలం జూకల్లోఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. సదాశివపేట మండలం ఎల్లారం గ్రామంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్‌చేశారు.
చిట్కుల్ గ్రామంలో కాంగ్రెస్‌నేత నీలం మధు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి, పటాకులు కాల్చుతూ, స్వీట్లు పంచుతూ సంబురాలు నిర్వహించారు. పటాన్చెరు మండలం రామేశ్వరం గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొని 218 లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. రాయికోడ్ మండలంలోని నాగ్వార్ లో జిల్లా లైబ్రరీ చైర్మన్ అంజయ్య లబ్ధిదారులకు పథకాల మంజూరు పత్రాలను
అందజేశారు.
మెదక్ జిల్లాలో..
మెదక్మండల పరిధిలోని బాలానగర్‌లో, పాపన్నపేట మండలంలోని పొడ్చన్పల్లితండాలో కలెక్టర్రాహుల్రాజ్రైతు భరోసా,ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు పథకాలను ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్పత్రాలను అందజేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. పెద్దశంకరంపేట మండలం దానంపల్లిలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి లబ్ధిదారులకు పథకాల పత్రాలను పంపిణీ చేశారు. రామాయంపేటలో ఎమ్మెల్యే రోహిత్ రావు కూరగాయ ల మార్కెట్ ను ప్రారంభించారు.
అనంతరం సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్అందజేశారు. నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో నాలుగు పథకాల ప్రారంభోత్సవం లో రేషన్ కార్డుల లిస్ట్ లో అనర్హుల పేర్లు వచ్చాయని పలువురు గ్రామస్తులు నిరసన తెలిపారు. రేగోడ్మండల పరిధిలోని గజ్వాడ లో స్పెషల్ ఆఫీసర్ మల్లేశం 272 గృహలక్ష్మి, 1,108 రైతు భరోసా, 8 ఆత్మీయ భరోసా, 176 రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్‌ను లబ్ధిదారులకు అందజేశారు.
సిద్దిపేట జిల్లాలో..
కోహెడ్మండలంలోని పోరెడ్డిపల్లిలో కలెక్టర్మనుచౌదరి 4 పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్కాపీలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి, హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్ లో స్వీకరించిన దరఖాస్తులు, సామాజిక,ఆర్థికసర్వేలో నమోదు చేసిన వివరాలన్నింటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పారు.
సిద్దిపేట అర్బన్ మండలం ఎలుపల్లి, రూరల్ మండల వెంకటాపూర్ గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ పద్మ, జడ్పీ సీఈవో రమేశ్, తహసీల్దార్సలీంమియా పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొని సీఎం సందేశాన్ని వినిపించారు. అర్హులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసి కార్యక్రమాన్ని ముగించారు.