హైదరాబాద్, వెలుగు : 317 జీవో బాధితులకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. ఈ జీవోతో స్థానికత కోల్పోయి సొంత జిల్లాలకు దూరంగా డ్యూటీ చేస్తున్న టీచర్లు, ఇతర ఉద్యోగులకు తమ ప్రజా ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో 317 జీవో ఎంప్లాయిస్, టీచర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికే స్పౌజ్, మెడికల్, మ్యుచువల్ ఉద్యోగులకు న్యాయం చేయటానికి జీవోలు ఇచ్చామని, పోస్టింగ్ ప్రాసెస్ కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.