టీబీ నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్

టీబీ నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్
  • 9 జిల్లాల్లో 26 మొబైల్ టెస్టింగ్ల్యాబ్స్‌‌‌‌ ఏర్పాటు చేశాం
  • హెల్త్  మినిస్టర్  దామోదర రాజనర్సింహ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు స్పెషల్ డ్రైవ్​  నిర్వహిస్తున్నామని వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ప్రస్తుతం 9 జిల్లాల్లో మొత్తం 26 మొబైల్​ టెస్టింగ్​ ల్యాబ్స్  ఏర్పాటుచేసి అనుమానితులకు టెస్టులు చేయిస్తున్నామని ఆయన వెల్లడించారు. టీబీ ముక్త్ భారత్  అభియాన్‌‌‌‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో మంత్రి దామోదర పాల్గొన్నారు.

 అన్ని వాహనాల్లోనూ డిజిటల్ ఎక్స్‌‌‌‌–రే మెషీన్లు, సీబీ నాట్ మెషీన్లను అందుబాటులో ఉంచామని కేంద్ర మంత్రికి ఆయన తెలిపారు. వంద రోజుల కార్యక్రమానికి సరిపడా టెస్టింగ్  రీఏజెంట్స్‌‌‌‌, డ్రగ్స్‌‌‌‌  అందుబాటులో ఉంచామని చెప్పారు. 9 జిల్లాల్లో కలిపి ఇప్పటి వరకూ 7,219 మందికి స్క్రీనింగ్  చేయగా, 181 మందికి టీబీ పాజిటివ్  వచ్చిందని వివరించారు.

 దేశంలో 2025 నాటికి టీబీని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈనెల 7న ఆదిలాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, మెదక్‌‌‌‌, నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్, పెద్దపల్లి, సూర్యాపేట, వనపర్తి  జిల్లాల్లో టీబీ ముక్త్  భారత్ అభియాన్  కార్యక్రమాన్ని ప్రారభించామని చెప్పారు. ప్రజలకు టీబీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను భారీగా పెంచామన్నారు. 

2023లో 5.74 లక్షల మందికి టీబీ టెస్టులు చేయగా, 2024లో 7.82 లక్షల మందికి టెస్టులు నిర్వహించామన్నారు. ట్రీట్‌‌‌‌మెంట్  సక్సెస్‌‌‌‌  రేటు దేశంలో సగటున 87 శాతం ఉంటే, తెలంగాణలో 90 శాతం ఉందని మంత్రి తెలిపారు. కాగా.. టీబీ పేషెంట్లను గుర్తించి, ట్రీట్‌‌‌‌మెంట్  కోసం వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 347 జిల్లాల్లో (ఈనెల 7న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే ఏడాది  మార్చి 17 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.