డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం: మంత్రి దామోదర రాజనరసింహ

డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం: మంత్రి దామోదర రాజనరసింహ

నిజామాబాద్/రెంజల్‌ (నవీపేట), వెలుగు: పేదల వైద్యం కోసం ప్రభుత్వం ఎంత డబ్బయినా ఖర్చు చేసేందుకు రెడీగా ఉందని మంత్రి దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజనర్సింహ చెప్పారు. ప్రభుత్వం ఎంత చేసినా డాక్టర్లు, సిబ్బందిలో సేవాభావం లేకుంటే అంతా వ్యర్థమేనన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే డాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆదివారం నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంసీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెంజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం మెడికల్‌ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఉన్నత ప్రమాణాలతో విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించాలన్న సంకల్పంతో సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో అవసరమైన చోట పీహెచ్‌‌‌సీలను సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు.

సెలెక్టెడ్‌ ప్రాంతాల్లో ఐవీఎఫ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మారుమాల ప్రాంతాలు, ఆదివాసీ ఏరియాల్లో వైద్య సేవలు విస్తరిస్తామని, రోగులను జిల్లా హాస్పిటల్స్‌కు తరలించేందుకు ఇటీవల 213 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని, త్వరలోనే మరో 85 అంబులెన్స్‌లు రాబోతున్నాయని చెప్పారు. గర్భిణుల కోసం 102 అమ్మ ఒడి వాహనాలు సమకూర్చనున్నామని, హైవేలపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.

ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌ అలీ, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌‌, డీఎంఈ వామి, టీపీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్, కో ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మానాల మోహన్‌ ‌రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు, అగ్రికల్చర్‌ కమిషన్‌ మెంబర్‌ గడుగు గంగాధర్‌‌‌‌, మేయర్‌ నీతూ కిరణ్‌ పాల్గొన్నారు.