
సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సీఎంహెచ్ కెమికల్ ఫ్యాక్టరీలో గాయపడిన కార్మికులను బుధవారం సాయంత్రం మంత్రి దామోదర్ రాజనర్సింహా పరామర్శించారు. మంగళవారం రాత్రి రియాక్టర్ పేలి ఐదుగురు కార్మికులకు గాయాలు కాగా, ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.
బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై కలెక్టర్ వల్లూరు క్రాంతి మంత్రికి ప్రాథమిక నివేదిక అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రియాక్టర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని, గాయపడిన వారిలో ఒకరు మరణించినట్లు చెప్పారు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ లో లోపాలు ఉన్నట్టు తెలుస్తుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.