జోగిపేట/పుల్కల్, వెలుగు: పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఆదివారం అందోల్, పుల్కల్ మండలాల్లో పర్యటించారు. అందోల్ గురుకుల పాఠశాల, పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీలను సందర్శించారు. కేజీబీవీలో పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పనులు స్పీడప్ చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పుల్కల్ మండలం బస్వాపూర్ మాడల్ స్కూల్ పనులను పరిశీలించారు. హాస్టల్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సింగూరు గురుకులంలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు