6 వేల స్కూళ్లు మూతపడ్డాయనేది అవాస్తవం: మంత్రి దామోదర రాజనర్సింహ

6 వేల స్కూళ్లు మూతపడ్డాయనేది అవాస్తవం: మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 6 వేల స్కూళ్లు మూతపడ్డాయనేది అవాస్తవమని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యాశాఖపై చర్చ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ స్కూళ్లు మూతపడలేదని.. విద్యా ప్రమాణాలు పెంచాలనేదే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైట్ టూ ఎడ్యుకేషన్ అనేది మన హక్కు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల హయంలో ఎన్ని స్కూళ్లు మూతపడ్డాయని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిందని ఆరోపించారు. గత పదేళ్లలో 8 లక్షల వరకు స్టూడెంట్స్ తగ్గారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా 734 రెసిడెన్షియల్ స్కూళ్లు వచ్చాయని తెలిపారు. అలాగే.. 600 వందల గురుకులాలు రెంట్ బిల్డింగ్‎లో ఉన్నాయని  చెప్పారు. గత ప్రభుత్వ తీరు వల్ల దాదాపు 2 లక్షల మంది పిల్లలకు సౌకర్యాలు లేవని విమర్శించారు. అవే క్లాస్ రూమ్స్, అవే హస్టల్స్ అని అన్నారు. హాస్టళ్ల మంజూరు తప్పు కాదని.. కానీ దానికి తగిన వసతులు ఏవి అని ప్రశ్నించారు. 

ALSO READ | దుద్దిళ్ల Vs వేముల: అసెంబ్లీలో లిక్కర్ లొల్లి