
హైదరాబాద్: వ్యవసాయం అంటే దండగ కాదు పండగలా మార్చింది కాంగ్రెసేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం (ఏప్రిల్ 18) రాయికోడ్ ఆత్మ కమిటీ చైర్మన్ నలచేరు కచూర్ రావు, 23 మంది సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి దామోదర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎల్లప్పడూ అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. వ్యవసాయాన్ని పండగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
రాయికోడ్ ప్రాంతంలో లిఫ్టు ఏర్పాటుకు కృషి చేస్తున్నమని తెలిపారు. ఆందోల్ నియోజకవర్గంలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి ఆత్మ కమిటీలు పనిచేస్తాయని పేర్కొన్నారు. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న ప్రదేశాలను రైతులు సందర్శించి.. ఆ పద్ధతులు ఇక్కడ అమలు చేయాలని సూచించారు.