ఈహెచ్ఎస్ అమలు చేస్తం : మినిస్టర్ దామోదర

  • టీజీవో నేతలతో మినిస్టర్ దామోదర

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు, పెన్షనర్ల ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ( ఈహెచ్ఎస్ ) అమలుకు రాష్ర్ట ప్రభుత్వం రెడీగా ఉందని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ  అంశంపై  వచ్చే నెల 5న ఉద్యోగుల జేఏసీ నేతలను చర్చలకు పిలుస్తామని హామీ ఇచ్చారు.

 బుధవారం సెక్రటేరియెట్ లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( టీజీవో ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ, నేతలు రామకృష్ణ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ , శ్రీరామ్ రెడ్డిలు మంత్రిని కలిసి ఈహెచ్ఎస్ ను అమలు చేయాలని వినతిపత్రం అందచేశారు.