
జోగిపేట, వెలుగు: ఆందోల్గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గోదారంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. కల్యాణోత్సవానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారి టెంకాయ వేలం నిర్వహించగా రూ. 10,116 కు దక్కించుకున్నారు. అనంతరం భక్తుల కోరిక మేరకు శ్రీ రంగనాథ స్వామి జాతర నూతన రథం కోసం రూ. 15 లక్షల విరాళం ప్రకిటించారు.
ముందుగా రూ. 2 లక్షలు అందజేశారు. అనంతరం జోగిపేటలోని మల్లన్న గుడిలో జరిగిన స్వామివారి కల్యాణోత్సవానికి హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎక్స్ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, తెలంగాణ రాష్ట్ర మాజీ మార్కెఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య , జోగిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ నాగభూషణం, ఆందోల్ మాజీ జడ్పీటీసీ నవాబు గారి భూమయ్య, కౌన్సిలర్ పిట్ల లక్ష్మణ్ పాల్గొన్నారు