
టేక్మాల్, వెలుగు: మెదక్ జిల్లా కాంగ్రెస్మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ మజార్ ఆదివారం టేక్మాల్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టేక్మాల్ దర్గాలో మంత్రి ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారికి పండ్లు, మిఠాయిలు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్అధ్యక్షుడు రమేశ్, నాయకులు కిషన్, మల్లారెడ్డి, సత్యనారాయణ, పాపయ్య, నరసింహారెడ్డి, భూమయ్య, సాగర్, కిషోర్, రాజు, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.