హాస్పిటళ్లలో ఫైర్​సేఫ్టీ తనిఖీల కోసం పది బృందాలు ఏర్పాటు : దామోదర రాజనర్సింహా

  • ఏర్పాటు చేయాలని అధికారులకు హెల్త్ మినిస్టర్  ఆదేశం
  • సిబ్బందికి అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫైర్​సేఫ్టీ తనిఖీల కోసం వెంటనే పది బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. ఈ బృందాలు తొలుత గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎంజీఎం వంటి పెద్ద హాస్పిటళ్లలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైర్ సేఫ్టీ  మెజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శనివారం ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్​లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవలే ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ దవాఖానలో అగ్నిప్రమాదం జరిగి పిల్లలు చనిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. 

అలాంటి ప్రమాదాలు బాధాకరం అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ‘‘మంటలను ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో? లేవో చూడాలి. వాటి  తుదిగడువు తేదీలను చెక్  చేయాలి. ఫైర్ సేఫ్టీ, మంటలను ఆర్పే యంత్రాల వినియోగంపై హాస్పిటళ్లలో పనిచేసే సిబ్బందికి ట్రైనింగ్  ఇవ్వాలి. హాస్పిటళ్లలో పవర్ సప్లై సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించాలి. పాత ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటే, వాటి స్థానంలో నాణ్యమైన కొత్త కేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలి. ప్రతి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫైర్​ ఎవకేషన్​ ప్లాన్​ రూపొందించాలి. ఆ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవగాహన కల్పించాలి” అని మంత్రి పేర్కొన్నారు.