విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి : మంత్రి దామోదర రాజనర్సింహా

జగిత్యాల, వెలుగు: సీఎస్ఆర్ నిధులతో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా పేర్కొన్నారు.  శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఓ ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ధర్మపురిలోని 30 బెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్యూనిటీ హాస్పిటల్​ను 100 బెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తామని, మార్చురీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

వైద్య కాలేజీలు, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రమాణాలు ఉన్నప్పటికీ వినియోగించుకునే వ్యవస్థ లేదన్నారు. ప్రణాళికతో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతమంతా బొగ్గు గనులు ఉన్నాయని, గతంలో విధంగానే సీఎస్ఆర్ నిధులు కేటాయించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంగనబట్ల దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉపాధ్యక్షులు వేముల రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుముక్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్,  రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లక్ష్మణ్, రవి, సాగర్,  నరేందర్ పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రిని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అడిషనల్​కలెక్టర్​బీఎస్ లత మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందించారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై 
చర్చించారు. 

ధర్మపురిలో మంత్రి పూజలు 

మంత్రి దామోదర రాజనరసింహ కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ధర్మపురిలో పూజలు చేశారు. ఆయనవెంట ప్రభుత్వ విప్  లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ దివాకర మంత్రికి స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది మంత్రి కుటుంబానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.