స్థానిక విద్యార్థులకే పీజీ సీట్లు దక్కేలా చూస్తం

స్థానిక విద్యార్థులకే పీజీ సీట్లు దక్కేలా చూస్తం
  • మంత్రి దామోదర రాజనర్సింహా

హైదరాబాద్, వెలుగు: స్థానికేతరులకు అవకాశం ఇవ్వాలని కోర్టు చెప్పడాన్ని కూడా కొంతమంది వక్రీకరిస్తున్నారని, ఈ తీర్పుతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. వారు చేస్తున్న తప్పుడు ప్రచారం, గోబెల్స్ కూడా సిగ్గుపడేలా ఉందన్నారు‌‌‌‌. ఈమేరకు బుధవారం ఎక్స్​ వేదికగా స్పందించారు.

తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో 15 శాతం అన్‌‌‌‌రిజర్వ్‌‌‌‌డ్ కోటాలో చదివిన నాన్ లోకల్ విద్యార్థులను, పీజీ అడ్మిషన్లలో లోకల్ కోటాకు ఇన్‌‌‌‌ఎలిజిబుల్ చేసి, తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా జీవో 148, 149 తీసుకొచ్చామని పేర్కొన్నారు. కోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి, స్థానిక విద్యార్థులకు పీజీ సీట్లు దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.