
సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజ నరసింహ పర్యటించారు. జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలు తీర్చేందుకు 500 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి నర్సింగ్ కాలేజీ.. ప్రతి జిల్లాకు మొబైల్ క్యాన్సర్ సేవలు ప్రారంభిస్తామన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు. జహీరాబాద్ ప్రాంతం NIMZ ద్వారా అభివృద్ధి చెందుతుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. యువకులకు స్కిల్ డెవలప్ మెంట్ చాలా అవసరమన్నారు. రుణ మాఫీ విషయంలో మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అర్హులైన ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తామన్నారు.