
హైదరాబాద్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) సేవలను ప్రారంభించడంపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి దామోదర రాజనర్సింహా తప్పుబట్టారు. ఐవీఎఫ్ సెంటర్లకు 2018లో జీవోలు ఇచ్చి ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. బీఆర్‌ఎస్ నేతలకు దమ్ముంటే ఎంజీఎం, పేట్లబుర్జు దవాఖాన్లలో ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నట్లు నిరూపించాలని మంత్రి సవాల్ చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో గాంధీ హాస్పిటల్‌లో ఒక్కరికైనా ఐవీఎఫ్ చేసినట్టు నిరూపించాలని ఫైర్ అయ్యారు. ఐవీఎఫ్ సేవలు అమలు చేయనందుకు మహిళలకు బీఆర్‌ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని గురువారం ‘ఎక్స్‌లో’ ప్రశ్నించారు.