ఆశ్రమ స్కూల్ స్టూడెంట్లను మంత్రి దామోదర పరామర్శ

హైదరాబాద్​సిటీ, వెలుగు: నిమ్స్​లో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థినులను వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం పరామర్శించారు. విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజ ఆరోగ్యపరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. 

వారు త్వరగా కోలుకొని స్కూల్ కి వెళ్లాలని ఆకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మంత్రి నిమ్స్ ఆస్పత్రిలోని పలు విభాగాలను  పరిశీలించారు. రోగులను పలకరించారు. నిమ్స్ ఆస్పత్రిని బలోపేతం చేస్తామని, పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు.