తెలంగాణలో డెంగ్యూ కట్టడి కోసం స్పెషల్ డ్రైవ్: మంత్రి దామోదర

తెలంగాణలో  డెంగ్యూ కట్టడి కోసం స్పెషల్ డ్రైవ్: మంత్రి దామోదర

తెలంగాణలో  డెంగ్యూ కట్టడి కోసం స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.వైరల్ ఫీవర్స్ కట్టడిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో ప్రజారోగ్య సంచాలకులు (DH)  ఆధ్వర్యంలో  కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

Also Read :- మూడు పార్టీల మధ్య పొలిటికల్ హీట్

ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలు కంట్రోల్ రూంమ్స్ కి అందించాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల బారినపడ్డవారికి మెరుగైన చికిత్స అందేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు దామోదర.