హైదరాబాద్ లోని ఏంఎంజే ఆసుపత్రిని హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు, రాష్ట్రంలో స్వాగతం ఐదు క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ పట్టణంలో కొత్తగా ఏర్పాటైన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖ తో కలిసి ప్రారంభించారు.
ALSO READ | సందర్భం : అవగాహనతో అడ్డుకట్ట వేయొచ్చు!
అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో డయాబెటిస్, క్యా న్సర్, బీపీ, హార్ట్ ఎటాక్ సమస్యలు బాగా పె రుగుతున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ఆయా వ్యాధులపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేగాక ప్రజల సౌకర్యార్థం మొబైల్ స్క్రీనింగ్ యూనిట్ లను అందు బాటులోకి తీసుకు రానున్నట్టు తెలిపారు. నేషనల్ హైవే ల మీద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అం దించేందుకు 74 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.