రాబోయే తరాలకు మన్మోహన్ స్ఫూర్తి: దామోదర రాజనర్సింహ

రాబోయే తరాలకు  మన్మోహన్ స్ఫూర్తి: దామోదర రాజనర్సింహ

రాబోయే తరాలకు  కూడా మన్మోహన్ స్ఫూర్తి అని అన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ.  అసెంబ్లీలో మన్మోహన్ మృతికి సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడిన ఆయన..  మన్మోహన్ సింగ్ అనేక పదవులు అలంకరించారని అన్నారు. మన్మోహన్ మానవతావాది, దార్శనికులు అని కొనియాడారు.   లేటరల్ ఎంట్రీతో మన్మోహన్ కేబినెట్ లోకి వచ్చారని తెలిపారు. 

Also Read : చరిత్రలో నిలిచిపోయే చట్టాలు తెచ్చిన గ్రేట్ లీడర్ మన్మోహన్ సింగ్

 దేశం ఆర్థిక స్థిరత్వం సాధించడంలో మన్మోహన్ కృషి ఉందన్నారు దామోదర రాజనర్సింహా. ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారీ తనం కోసమే ఆర్టీఐ తీసుకొచ్చారన్నారు. కూటమిలో విభేదాలున్నా.. యూఎస్ తో అణుఒప్పందం చేసుకున్నారని తెలిపారు.  మన్మోహన్  సౌమ్యుడు, మితభాషి, ఓ విజనరీ,  కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి, అందరికీ ఆదర్శవంతుడని కొనియాడారు రాజనర్సింహ.