
టేక్మాల్, వెలుగు: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ధనుర గ్రామ శివారులోని దుబ్బగట్టు వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రిని ఆలయ సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో రమేశ్, యూసుఫ్, మంజుల, కిషన్, సత్యనారాయణ, మల్లారెడ్డి, శ్రీధర్ రెడ్డి, సాగర్, కిషోర్, రాజు, శివగౌడ్, సంగమేశ్, మహేశ్ రెడ్డి, ప్రవీణ్, సాయి, శేషు గౌడ్ పాల్గొన్నారు.