డోంట్ వర్రీ: గణేష్ నిమజ్జనంలో 30 హెల్త్ క్యాంప్స్

డోంట్ వర్రీ: గణేష్ నిమజ్జనంలో 30 హెల్త్ క్యాంప్స్

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జన సందడి నెలకొంది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయాలని, నిమజ్జనం జరిగే ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్‎లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సత్వర వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండి.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‎కు లక్షలాదిగా తరలివస్తున్న గణేష్ భక్తులు, పర్యాటకులకు అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

మంత్రి ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలలో 30 చోట్ల హెల్త్ క్యాంప్‎లను, అంబులెన్స్‎లతో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మెడికల్ కిట్లును అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. వైద్య పరమైన అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రికి చేరుకునే వారికి సత్వరం వైద్యాన్ని అందించాల్సిందిగా మంత్రి ఆదేశించిడంతో ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.