నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి నాయకున్ని చూడలేదు

కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కరోనా దెబ్బకు
రాష్ట్రం అప్పుల్లో వున్నా సరే రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారని ఆయన అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా వరంగల్ జిల్లాలో ఏర్పాటుచేసిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మన దగ్గర సాగు చేసే పత్తికి జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేసినట్లయితే రైతులకు ఆశించిన గిట్టుబాటు ధరలు లభిస్తాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాకు మంచి భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో పరిశ్రమలన్నీ వరంగల్‌కు రాబోతున్నాయి. కరోనా నియంత్రణ చర్యల్లో వరంగల్ ఉమ్మడి జిల్లా అధికారులు మరియు ప్రజల చైతన్యం అభినందనీయం. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి. గుంపులు గుంపులుగా ఉండొద్దు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకున్ని చూడలేదు. రైతులు, ప్రజలకు నమ్మకం ఏర్పరిచిన మహానుభావులు కేసీఆర్. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ పోరాట యోధులకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను’ అని ఆయన అన్నారు.

For More News..

హగ్స్, హైఫైలు లేకపోయినా ఫర్వాలేదు

చెత్తబుట్టలో బీసీ లోన్‌‌ దరఖాస్తులు

జనం కోసమే తెలంగాణ

ఉద్యమ లక్ష్యాలకు దూరంగా..