ఆఫీసర్లు ప్రజలతో మమేకమై పనిచేయాలి : మంత్రి సీతక్క

ఆఫీసర్లు ప్రజలతో మమేకమై పనిచేయాలి : మంత్రి సీతక్క

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : జిల్లా ఆఫీసర్లు ప్రజలతో మమేకమై పని చేయాలని పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క సూచించారు. బుధవారం రాత్రి మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. వరదలకు దెబ్బతిన్న15 ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ రహదారులు, నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవేలకు వెంటనే రిపేర్లు చేసి, అవసరమైన చోట బ్రిడ్జిల నిర్మాణానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లాలో 136 చెరువులుకు నష్టం జరుగగా, ఇప్పటికే కొన్ని చోట్ల రిపేర్లు పూర్తి అయ్యాయని, మిగతా వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. 

ఆఫీసర్లు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌లో పర్యటించి వ్యవసాయం, ఉద్యానవన  పంటల నష్టం వివరాల రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను రెడీ చేయాలని చెప్పారు. వరదల కారణంగా దెబ్బతిన్న గ్రామాల్లో 1,160 హెల్త్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేసి, 19,724 మందికి ఫీవర్‌‌‌‌‌‌‌‌ సర్వే నిర్వహించామని, ప్రజలకు కావాల్సిన మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఎంపీ పోరిక బలరాంనాయక్‌‌‌‌‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌‌‌‌‌‌‌‌, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అద్వైత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌, ఎస్పీ సుధీర్‌‌‌‌‌‌‌‌ రాంనాథ్‌‌‌‌‌‌‌‌కేకన్‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు లెనిన్‌‌‌‌‌‌‌‌ వత్సల్‌‌‌‌‌‌‌‌ టొప్పో, డేవిడ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

రాజీవ్‌‌‌‌‌‌‌‌ విగ్రహాన్ని కూలుస్తామనడం దుర్మార్గం

మహబూబాబాద్/కొత్తగూడ, వెలుగు : రాజీవ్‌‌‌‌‌‌‌‌గాంధీ విగ్రహాన్ని కూలుస్తామని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు ప్రకటించడం దారుణం అని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో చేపట్టిన పలు పనులకు బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. 18 ఏళ్లకే ఓటు హక్కు, గ్రామ పంచాయతీల బలోపేతం కోసం 73, 74 యాక్ట్ సవరణలు, పరిపాలనలో మహిళల భాగస్వామ్యం చేయడం, దేశానికి టెక్నాలజీని తీసుకువచ్చిన ఘనత రాజీవ్‌‌‌‌‌‌‌‌గాంధీకే దక్కుతుందన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుమార్తె కవిత రూపంలో ఉన్న విగ్రహాలే తెలంగాణ అంతటా ఉండాల్నా అని ప్రశ్నించారు.

 రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీని చంపుతామని బీజేపీ లీడర్లు బెదిరించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. దేశంలో కులగణన చేపట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరడం బీజేపీ లీడర్లకు గిట్టడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ కలిసి రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి గాజులు, బొట్టు, చీరలు చూపుతూ అవహేళన చేయడం సరికాదన్నారు. మహిళలు చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం సంస్కృతిలో భాగమన్నారు. మహిళలంటే అంత చులకనగా ఉందా ? అని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీని బెదిరించిన బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌ తన్వీన్దర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ఆరా దిష్టిబొమ్మను మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌లో దహనం చేశారు.