గ్యారంటీల అమలుకు కాంగ్రెస్​ కట్టుబడి ఉంది : దుద్దిళ్ల శ్రీధర్​బాబు

గ్యారంటీల అమలుకు కాంగ్రెస్​ కట్టుబడి ఉంది : దుద్దిళ్ల శ్రీధర్​బాబు
  •     యువకుడు, విద్యావేత్త అనే వంశీకి టిక్కెట్​ ఇచ్చిండ్రు
  •     మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు

పెద్దపల్లి, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టబడి  ఉందని, ఇప్పటికే కొన్ని గ్యారంటీలు అమలవుతున్నాయని, యువకుడు, విద్యావేత్త, పారిశ్రామికవేత్త అనే గడ్డం వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్​ను హైకమాండ్​ ఇచ్చిందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్​బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని కేంద్రంగా శనివారం  ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగ్​లో ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు.

అభివృద్ది,  సంక్షేమాన్ని రెండింటిని సమానంగా ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్​ ప్రయత్నం చేస్తుందన్నారు.  బీఆర్​ఎస్​  అభ్యర్థి గతంలో మంత్రిగా ఉండి  కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఓట్లు దండుకోవడానికే ప్రతిపక్షాలు  కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు చేస్తున్నాయన్నారు.   మంథని చుట్టూ రింగ్​ రోడ్​ ఆలోచనఉందని  , దానికి వంశీని కలుపుకొని రింగ్​ రోడ్డు పూర్తి చేస్తామన్నారు.  ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ మాట్లాడుతూ  పదేళ్ల బీఆర్​ఎస్​ కాలంలో ప్రజలకు ఏం చేశారని మళ్లీ ఓటుగుతున్నారని ప్రశ్నించారు.  

గతంలో  కాకా వెంకటస్వామి నేతృత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు.  నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తామన్నారు.  విశాఖ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు  20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మోసం చేసిందన్నారు.  ఎంపీగా తనను గెలిపిస్తే  మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తామన్నారు.