- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
పెద్దపల్లి/ రామగిరి, వెలుగు : పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్, రామగిరి మండల కేంద్రాల్లో గురువారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగులలో అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఐదు గ్యారంటీలను అమలుచేశామన్నారు. ఎన్నికల తర్వాత మిగతావాటిని పూర్తిచేస్తామన్నారు.
అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పెరుగుదలకు గత సర్కారే కారణమన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం కూడా లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. తనను మీ చిన్న కొడుకుగా భావించి ఓటేసి గెలిపిస్తే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.