ప్రజా ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ప్రజా ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మల్హర్ (కాటారం), వెలుగు : ప్రజా ఆరోగ్యానికే రాష్ట్ర ప్రభుత్వం మొదటి  ప్రాధాన్యతను ఇస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో  108 వాహనాన్ని మంత్రి, కలెక్టర్  రాహుల్ శర్మతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ సూపర్ వైజర్లుకు ఈసీఐఎల్ సీఎస్ఆర్ నిధులతో ఎలక్ట్రానిక్ స్కూటీలను పంపిణీ చేశారు. మల్హర్ మండలానికి ఐదు, భూపాలపల్లికి 15 స్కూటీలు అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి సోదరి బొమ్మ వీరమ్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని మంత్రి  పరామర్శించారు. కాటారం మండల కేంద్రంలో రూ.10 లక్షలతో మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణం, శ్రీపాద కాలనీలో రూ. 10 లక్షలతో నిర్మించనున్న సైడ్ డ్రైన్లు,  రూ.15 లక్షలతో సీసీ రోడ్ల  పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, కాంగ్రెస్  లీడర్లు ఉన్నారు.