సన్నబియ్యం ఇస్తున్నది దేశంలో తెలంగాణ ఒక్కటే : మంత్రి శ్రీధర్ బాబు 

సన్నబియ్యం ఇస్తున్నది దేశంలో తెలంగాణ ఒక్కటే : మంత్రి శ్రీధర్ బాబు 

మంథని, వెలుగు: పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసే రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేననన్నారు. గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో ప్రజలకు దొడ్డు బియ్యం అందించేవారని, వాటిని పేదలు తినలేకపోయేవారని, దీంతో అక్రమ రవాణా జోరుగా సాగేదన్నారు. ప్రభుత్వంలో రేషన్ డీలర్లు భాగస్వాములని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, 15 రోజుల్లో జాబితా తయారుచేసి అర్హులకు ఇండ్లు ఇస్తామన్నారు. లీడర్లు అయిలి ప్రసాద్, కొత్త శ్రీనివాస్, కాచే, చొప్పరి సదానందం, దొడ్డ బాలాజీ పాల్గొన్నారు