మెస్ చార్జీలు గ్రీన్​ఛానల్​లో ఉంచాం : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మెస్ చార్జీలు గ్రీన్​ఛానల్​లో ఉంచాం : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రంగారెడ్డి, వెలుగు: విద్యార్థుల మెస్ చార్జీలు గ్రీన్ ఛానల్​లో ఉంచామని, వారికి కావలసిన మౌలిక వసతులు, సౌకర్యాలను అందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ, రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో శంషాబాద్ మండలంలోని పాలమాకుల కేజీబీవీని అధికారులతో కలిసి ఆదివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థినిలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. కస్తుర్బా గాంధీ విద్యార్థినిల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన టీచర్లపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సమస్య మళ్లీ రిపీట్​ కావొద్దని కలెక్టర్ శశాంకను ఆదేశించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బుర్ర జ్ఞానేశ్వర్, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, అడిషనల్​ కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఈవో  సుసిందర్ రావు  విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.