- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
చేవెళ్ల: బలహీనవర్గాల మేలు కోసమే సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని 9 వార్డులో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి సర్వేకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఎవరి రేషన్ కార్డులు తీయరన్నారు.
కుటుంబ స్థితిగతుల వివరాలు సేకరించి అన్ని విధాల సహకారం అందించడం జరుగుతుందని చెప్పారు. సర్వేలో భాగంగా ఈ మూడు రోజుల పాటు ఇంటి గుర్తింపు చేపట్టి, 9 నుంచి సమగ్ర కుటుంబ వివరాల సేకరణ ప్రారంభమవుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ పాల్గొన్నారు.