గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం : మంత్రి శ్రీధర్ బాబు

గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం : మంత్రి  శ్రీధర్ బాబు

ముత్తారం, వెలుగు: పదేళ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా తయారైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆదివారం ముత్తారం మండలం మైదంబండ  గ్రామంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని సరిదిద్దుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, కొంత ఆలస్యమైనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టమన్నారు. రైతుల విషయంలో రాజీ పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.21వేల కోట్లతో రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. 

సన్నాలకు రూ.500 బోనన్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. సాగులో ఉన్న భూములకు రెండు దఫాలుగా ఏడాదికి రూ.12వేలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అయినప్పటికీ బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలు రైతులకు మాయమాటలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ దౌర్భాగ్య పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ఇవ్వబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధిని  జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు. మంథని-–ముత్తారం రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.60కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అనంతరం ముత్తారం, రామగిరి మండలాల్లో ఇటీవల చనిపోయిన వారి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మంత్రి వెంట కాంగ్రెన్ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి నదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, లీడర్లు అల్లం స్వామి, మద్దెల రాజయ్య, శంకర్, దుండే రాజేందర్ ఉన్నారు.