![మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణికి .. ప్రభుత్వం కీలక బాధ్యతలు](https://static.v6velugu.com/uploads/2023/12/minister-duddilla-sridhar-babus-wife-has-key-responsibilities-in-the-governmentjpg1_c3riGg65mT.jpg)
తెలంగాణ ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ శైలజా రామయ్యర్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం శైలజా రామయ్యర్ యవజన సర్వీసులు, పర్యాటకశాఖ మఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
ఇక అమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా, మూసీ అభివృద్ధి సంస్థ ఇంచార్జి ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంధనశాఖ కార్యదర్శిగా, ట్రాన్స్‌కో, జన్ కో సీఎండీగా రిజ్వికి బాధ్యతలు అప్పగించింది. ట్రాన్స్‌కో సంయుక్త ఎండీగా సందీప్ కుమార్ ఝా, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కం సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి నియామకం అయ్యారు.