గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయండి…

వరంగల్: గ్రామ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని అన్నారు మంత్రి దయాకరరావు. వరంగల్ నగరంలో మాట్లాడిన ఆయన… ప్రతీ గ్రామం అభివృద్ధి కోసం 30రోజుల ప్రణాళికను ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామ కార్యదర్శికంటే… ఉపసర్పంచ్ కే ఎక్కువ గౌరవం ఉంటుందని ఆయన చెప్పారు. కార్యదర్శులకు చెక్ పవర్ అడిగే వారు ప్రభుత్వ వ్యతిరేక సర్పంచ్ లేనని అన్నారు మంత్రి. మిషన్ భగీరథ పనులు మొదలుపెట్టినపుడు… విమర్శించిన వారు.. ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు.

ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి నియామకం చేస్తున్నామని చెప్పారు దయాకర్ రావు. గ్రామాల అభివృద్ధికోసం రూ.348 కోట్ల నిధులను విడుదల చేశామని చెప్పారు. ప్రతీ పైసా అభివృద్ధికి ఉపయోగపడాలని అన్నారు. సర్పంచ్ ఆదేశాల మేరకే ఫీల్డ్ అసిస్టెంట్ పని చేయాలని చెప్పారు మంత్రి. గతంలో లేని విధంగా… నిధులు, అధికారులు అందుబాటులో ఉండటంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఇదే మంచి అవకాశమన్నారు దయాకర్ రావు.

రాష్ట్రానికి కోటీ 20 లక్షల చింత చెట్లు కావాలని అన్నారు దయాకర్ రావు. ప్రతి గ్రామపంచాయితీ సర్పంచ్ లు అధికారులు కూర్చుని తమ తమ గ్రామానికి ఎన్ని మొక్కలు కావాలో నిర్ణయించుకోవాలని… అయితే ప్రతీ మొక్క బతకాలని చెప్పారు. గ్రామ అభివృద్ధి కోసం దాతలను గుర్తించాలని చెప్పారు మంత్రి. ఇక నుంచి చిత్తశుద్ధితో పని చేయాలని… ప్రతి గల్లీ పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు. ఎజెండా లో ఉన్న అంశాలనే కాకుండా.. మీ ఊరికి ఎంకావాలో అన్నింటిని గుర్తించి చెప్పాలని సర్నంచ్ లకు తెలిపారు. గ్రామం లోని ప్రతీ అంశంపై సర్పంచ్ లను భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. స్వీపర్ల నియామకం సర్పంచ్ లకి అప్పగిస్తున్నామని తెలిపారు.

సర్పంచ్ గా ఎన్నిక అవడం చాలా మంచి అవకాశమని.. ఇకపై ప్రతీ సర్పంచ్ తమ తమ గ్రామాలను అభివృద్ధి చేసిచూపాలని చెప్పారు దయాకర్ రావు.   గ్రామ సర్పంచ్ లు చేసే ప్రతీ కార్యక్రమం  భవిష్యత్ తరాలు స్మరించుకునేలా ఉండాలని అన్నారు. అధికారుల సహకారం తో గ్రామ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని… టీం వర్క్ తో పని చేసి 30రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.