20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అన్న కామెంట్స్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని వాపోయారు. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తాను చెప్పలేదని అన్నారు. 15 నుంచి 20 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఉంటుందని, అందుకే 20 స్థానాల్లో కొంచెం సర్దుకోవాల్సి వస్తుందని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చుకున్నారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆరోపించారు.
కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి లక్ష మంది స్వచ్ఛందంగా సభకు తరలివస్తున్నరాని చెప్పారు. రైతులు పనులు వదులుకుని సైతం బీఆర్ఎస్ సభకు వస్తున్నారని అన్నారు.