చంద్రబాబు లెక్క రేవంత్‍రెడ్డి ఆలోచన చేయట్లే : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్య

చంద్రబాబు లెక్క రేవంత్‍రెడ్డి ఆలోచన చేయట్లే : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్య
  • క్వింటాల్‍ మిర్చికి రూ.25 వేలు ధర ఇవ్వాలని డిమాండ్  

వరంగల్‍/వరంగల్‍ సిటీ, వెలుగు: మిర్చి రైతుల మేలు కోసం ఏపీ సీఎం చంద్రబాబు లెక్క రాష్ట్ర సీఎం రేవంత్‍రెడ్డి ఆలోచన చేయట్లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‍రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్‍, రైతు రుణ విమోచన కమిషన్‍ మాజీ చైర్మన్‍ నాగుర్ల వెంకటేశ్వర్లుతో  కలిసి ఆయన వరంగల్‍ ఏనుమాముల మార్కెట్‍లో మిర్చి యార్డులను సందర్శించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‍ హయాంలో మిర్చికి క్వింటాల్‍కు రూ.25 వేల చొప్పున ధర ఉంటే.. రేవంత్‍ సర్కారులో రూ.11 వేలు మాత్రమే చెల్లిస్తూ రైతును దోపిడీ చేస్తున్నా రని ఆరోపించారు. మార్క్ ఫెడ్‍ ద్వారా మిర్చికి క్వింటాల్‍కు రూ.25వేల ధర చెల్లించాల ని ఆయన డిమాండ్‍ చేశారు. రేవంత్‍రెడ్డి మాటవిని సన్నబియ్యం పండిస్తే.. ఇప్పటికీ రూ.103 కోట్ల బోనస్‍ పడలేదన్నా రు. రైతుబంధు లేదని,  కేవలం 50 శాతం మాత్రమే రుణమాఫీ చేశారని విమర్శించారు. లేదంటే రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు.