హోంక్వారంటైన్ లో మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోం క్వారంటైన్ లో ఉన్నారు. మంత్రి ఎర్రబెల్లి పీఏతో పాటు ఇద్దరు గన్‌మన్లు, ఒక కానిస్టేబుల్‌, డ్రైవరు, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. మంత్రి వెంట ఉండే పీఏలు, గన్‌మన్లు, సహాయకులు మొత్తం 40 మందికి ఈ నెల 21న వరంగల్ లోని ఆయన స్వగృహంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. దాంతో వారందరినీ హైదరాబాద్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తన సహాయకులకు కరోనా పాజిటివ్ రావడంతో.. మంత్రి ఎర్రబెల్లి తనకు తానుగా హోంక్వారంటైన్ విధించుకున్నారు.

For More News..

కరోనాను జయించిన 101 ఏళ్ల మంగమ్మ

దేశంలో కొన్నిచోట్ల మళ్లీ లాక్‌డౌన్

యూఎస్ సర్కార్‌‌‌‌పై ఇండియన్ మహిళ కేసు