అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు

అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు

పల్లె ప్రగతితో మన పల్లెలు దేశానికి ఆదర్శంగా మారాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రం నుంచి  1450 కోట్ల బకాయిలు రావాల్సివుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పేట్ లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,స్పీకర్ పోచారం,ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం నుండి గ్రామ పంచాయతీలకు ఇవాల్సిన  బకాయిలు నయా పైసా లేకుండా ఇచ్చేసినట్లు ఎర్రబెల్లి తెలిపారు. కేంద్ర నిధికి సమానంగా ప్రతి ఏటా230 కోట్ల నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.  సొంత జాగాలో ఇళ్ల కట్టుకునే అవకాశం త్వరలోనే వస్తుందన్నారు. త్వరలోనే 57 ఏళ్లు నిండిన అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు.  పల్లె ప్రగతి కార్యక్రమం సాధించిన ఫలితాలు ఢిల్లీని తాకాయని..ఈ ప్రగతి కొనసాగాలని సీఎం కేసిఆర్ కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కాగా ఈ సభలో డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఫించన్ల కోసం మంత్రులను మహిళలు నిలదీశారు.  అయితే ఉంటే ఉండండి..లేకుంటే వెళ్లిపోండంటూ మహిళల పట్ల టీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు.