మంత్రి హామీ అమలుచేయాలి

కొల్లాపూర్, వెలుగు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు గతంలో పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని పంచాయతీ కార్మికుల సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్​లో వినతిపత్రం అందజేశారు.  

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ గతంలో34 రోజులు సమ్మె చేసినప్పుడు కార్మిక జేసేసీని చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరిస్తానని మాటిచ్చారని పేర్కొన్నారు. బాలస్వామి, మహబూబ్, బాల రాజు ఎం మల్లేశ్​​పాల్గొన్నారు.