- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు, వెలుగు : ఏండ్ల తరబడి గిరిజనులు పడుతున్న ఇబ్బందులను తొలగించింది సీఎం కేసీఆరేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. తండా బాట కార్యక్రమంలో భాగంగా శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు తండాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చు రేపుతున్న కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయని పథకాలను ఇక్కడ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
ALSO READ: విమోచన దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది : గవర్నర్
ఎస్టీ రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ వాళ్లు చెబుతున్న మూడు గంటల కరెంట్ కావాలో ? మూడు పంటలు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. కేసీఆర్‌కు మోసం చేస్తే, సేవాలాల్‌కు చేసినట్లేనన్నారు. అంతకుముందు డప్పుచప్పుళ్లు, డ్యాన్స్‌లు, బతుకమ్మలతో మంత్రికి స్వాగతం పలికారు.
అనంతరం ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యలో డ్రైవింగ్ లైసెన్స్‌లు అదంజేశారు. బీఆర్‌ఎస్‌లో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, సర్పంచ్‌లు కాలునాయక్, శారద, శోభన, పాడ్య రమేశ్, యాకమ్మ పాల్గొన్నారు.