నెల కష్టపడండి.. ఐదేళ్లు సేవ చేస్తా : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు

పాలకుర్తి ( దేవరుప్పుల ), వెలుగు : నెల రోజులు కష్టపడి తనను గెలిపిస్తే.. ఐదేళ్లు సేవ చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. ప్రజా సంక్షేమమే తన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రయారిటీ అని చెప్పారు. గురువారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండ, సింగరాజుపల్లిలో నిర్వహించిన రివ్యూల్లో ఆయన మాట్లాడారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రిగా గత ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని, ఎలక్షన్లు పూర్తి కాగానే, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రాగానే వాటిని కూడా పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ALSO READ : నామినేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉండాలె : కలెక్టర్ శరత్