- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి, వెలుగు : తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. పాలకుర్తి పంచాయతీ పరిధిలోని ఆరు గ్రామైక్య సంఘాల మహాసభను గురువారం స్థానికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణకు ముందు కేవలం రూ. 600 కోట్ల మేర లోన్లు ఇస్తే, ప్రస్తుతం రూ. 20 వేల కోట్లు అందజేస్తున్నట్లు చెప్పారు.
మహిళలే కేంద్రంగా, వారే లబ్ధిదారులుగా అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక మహిళాభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. అనంతరం రూ. 5 కోట్ల లోన్‌కు సంబంధించిన చెక్‌ను మహిళా సంఘా లకు అందజేశారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్‌పర్సన్ ఉషాదయాకర్‌రావు హాజరయ్యారు.